ఆది నువ్వు ఇంతవరకు చేసిందంతా బొక్క...రెజీనా బిజీనా
on Jun 24, 2025

ఢీ - 20 ఇది సర్ మా బ్రాండ్ న్యూ సీజన్ లాంఛ్ కి సిద్దమయ్యింది. ఇక ఆది ఎంట్రీ ఊరమాస్ డైలాగ్స్ తో అదిరిపోయింది. "ఆది గాడు బయటకు వస్తే చాలు సర్. సందుల్లో, పార్కుల్లో, రెస్టారెంటుల్లో ఎక్కడ పడితే అక్కడ అనుమానంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్నా సర్ నేను. అరె ఇదే ఢీ షోలో కంటెస్టెంట్స్ బాగా చేస్తే దగ్గరకు పిలిచి బుగ్గలు కొరికిన పూర్ణని చూసి మనం ఎం నేర్చుకున్నాం..హగ్గులిచ్చే ప్రియమణిని చూసి మనం ఎం నేర్చుకున్నాం ..మారాలి సర్ ఈ పద్దతి మారాలి..మార్పంటే అమ్మ ఏదో ఆకాశం నుంచి ఊడిపడక్కర్లేదు..ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి సర్..రెజీనా బిజీనా" అని అనేసరికి రెజీనా షాకైపోయింది. ఇక ఈ షోలోకి సౌమ్య ఎంట్రీ ఇచ్చింది. "షోకి చాల అందం పెరగాలని నన్ను పెట్టేసారు. షో కొంచెం హాట్ లో ఉండాలని నందుని పెట్టారు.
షో కొంచెం వెయిట్ ఉండాలని ఈ పొట్టోడిని పెట్టేసారు" అంటూ ఆది మీద పంచ్ డైలాగ్ లు వేసింది".."నేనుండగా నువ్వెందుకురా ఇక్కడ" అంటూ ఆది సౌమ్యని అడిగాడు. "ఇంతవరకు చేసిందంతా బొక్క" అనేసింది. ఆ డైలాగ్ కి తట్టుకోలేక "ఆపవే గుంట నక్క" అనేశాడు ఆది. ఆదితో గత సీజన్స్ లో జెస్సి చేసాడు, అశ్విని చేసింది ఇక ఇప్పుడు సౌమ్య వచ్చింది. ఆది, సౌమ్య కలిసి జబర్దస్త్ వంటి షోస్ లో కొన్ని స్కిట్స్ కూడా చేశారు. గతంలో సౌమ్య మీద నూకరాజు తెలుగు తెలీదంటూ కూడా కామెంట్స్ చేసాడు కానీ ఆమె తెలుగు కొంచెం బెటర్ గా నేర్చుకుని షోస్ లోకి వస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



